చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా విజయనగరం సిసిఎస్ డిఎస్పీ జే.పాపారావు మృతి చెందారు. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాపారావు.. ఇవాళ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అటు విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో ఆయన భార్య సుమతి కోవిడ్ చికిత్స పొందుతున్నారు. అలాగే విశాఖలోని కేర్ ఆసుపత్రిలో పెద్ద కుమారుడు కిరణ్, చిన్న కుమారుడు రవీంద్ర కరోనా చికిత్స పొందుతున్నారు. కడసారి తన తన భర్తను చూసుకోలేని దయనీయ స్థితిలో భార్య సుమతి ఉంది. తండ్రికి తలకోరువు పెట్టలేని స్థితిలో కుమారులు ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలోకి వెళ్లిపోయారు. పాపారావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరామపురం అనే గ్రామం. ఆయన పెద్ద కుమారుడు ఢిల్లీలోని ఎస్.ఆర్.ఎమ్ యూనివర్సిటీ లో బీటెక్ చేస్తుండగా…..చిన్న కుమారుడు విశాఖలో మెడిసిన్ చదువుతున్నారు. ఇక పాపారావు మృతికి విశాఖ రేంజ్ డిఐజి రంగారావు, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, జిల్లా పోలీస్ యంత్రాంగం సంతాపం తెలిపింది.
previous post
next post
సీమ ప్రజలకు తాగునీరు ఇవ్వండి.. సీఎం జగన్ కు లోకేశ్ సూచన!