telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఏక్తా కపూర్ క్షమాపణలు చెప్పాలి: రాజాసింగ్ డిమాండ్

rajasing mla bjp

బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలిఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ద్వారా రూపుదిద్దుకుంటున్న ‘అన్ సెన్సార్డ్ సీజన్-2’ వెబ్ సిరీస్ ట్రైలర్ లో ఆర్మీ యూనిఫామ్ ను కించపరిచే సన్నివేశాలు ఉండడంతో ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే హైదరాబాదుకు చెందిన విశాల్ కుమార్ అనే యువకుడు ఈ అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ యూనిఫామ్ ను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఏక్తా కపూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను కలిసి ఏక్తాపై ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో రాజాసింగ్ మాట్లాడుతూ, సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ట్రైలర్ ఉందని వ్యాఖ్యానించారు. ఏక్తా కపూర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts