telugu navyamedia
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో “ఎంత మంచివాడ‌వురా”

EM

నందమూరి క‌ళ్యాణ్ రామ్ 17వ చిత్రం స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “ఎంత మంచివాడ‌వురా” అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రంలో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంతో నిర్మాణ‌ రంగంలోకి అడుగుపెడుతుంది. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుజ‌రాతీ హిట్ చిత్రం “ఆక్సీజ‌న్‌”కి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ట‌. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, ఫీల్‌ను మిస్‌ చేయకుండా చాలా చ‌క్క‌గా స‌తీష్ వేగ‌శ్న తెర‌కెక్కిస్తున్నాడని అంటున్నారు. కాగా… సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు థియేట‌ర్స్‌లోకి రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మ‌హేష్ న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో పాటు అల్లు అర్జున్ న‌టిస్తున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యాయి. వీటితో పాటు ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న ద‌ర్భార్ కూడా సంక్రాంతి బ‌రిలో నిలుస్తుంది. అయితే ఈ సినిమాల‌కి పోటీగా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం ఎంత మంచి వాడ‌వురా కూడా సంక్రాంతికి థియేట‌ర్స్‌లోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. తాజాగా చిత్ర రిలీజ్‌పై అఫీషియ‌ల్ ప్ర‌ట‌క‌న చేశారు దర్శకనిర్మాతలు.

Related posts