నేను 11 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చానని తెలుగు సీనియర్ నటి కవిత అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చాలా సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించాను. సీనియర్స్ అయినప్పటికీ వాళ్ల పట్ల నాకు గౌరవమేగానీ భయం ఉండేది కాదు. నేను హీరోయిన్ గా చేసిన సినిమాలు విడుదలవుతుంటే మాత్రం భయపడేదానిని అని తెలిపారు.
జయసుధ .. జయప్రద .. శ్రీదేవి స్టార్ హీరోయిన్స్. ఆ సమయంలో నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను. వాళ్ల సినిమాల విడుదల సమయాల్లో అదృష్టం కొద్దీ నా సినిమాలు కూడా సక్సెస్ అయ్యేవి. అలాంటి తారలకు పోటీగా నిలిచి విజయాన్ని సాధించినందుకు నాకు ఇప్పటికీ గర్వంగానే ఉంటుంది. ఆ ముగ్గురు హీరోయిన్స్ కి నేను అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.