telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు భద్రత: గవర్నర్‌ తమిళిసై

governor tamilisai

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేదలకు భద్రత కల్పించాయని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి సభలో గవర్నర్‌ ప్రసంగించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ. 60 వేల నుంచి రూ. లక్షన్నరకు పెంచిందని గవర్నర్‌ తెలిపారు.

డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాదబీమాను ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్‌ పాఠశాలలను నడుపుతోందని విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని అందిస్తోందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రగతినిధిని ఏర్పాటు చేసిందన్నారు. వివిధ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తుందన్నారు. పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని స్పష్టం చేశారు.

Related posts