ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ పైన నిప్పులు చెరిగారు. అయితే విశాఖ పతనానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. విశాఖకు గుండెకాయ లాంటిది విశాఖ ఉక్కు అని చంద్రబాబు అన్నారు. అమృతరావు దీక్షకు అప్పటి కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. భారతదేశంలో నెంబర్ వన్ స్టీల్ ఫ్లాంట్ విశాఖపట్నం. ఐదు లక్షల మందికి జీవనోపాధి ఈ స్టీల్ ఫ్లాంట్ కల్పిస్తుంది. విశాఖలో భూములు వ్యాపారం చేసుకుంటారు తప్ప పారిశ్రామిక అభివృద్ధి చేయరు. విశాఖలో పరిశ్రమలకు నీటి కొరత లేకుండా మన ప్రభుత్వంలో ముందుకెళ్ళాం. రాష్ట్ర ప్రజల హాక్కులు, మనోభావాలను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. స్టీల్ ఫ్లాంట్ ను కూడా దోచుకోవాలనే ఆలోచన వైసిపీ ప్రభుత్వానికి ఉండడం దుర్మార్గం. ఇది జరుగుతుంటే తాడేపల్లిలో ఉన్నా జగన్ మోహన్ రెడ్డి పబ్జి ఆడుతున్నావా?… ఈ దొంగలే దొంగనాటకాలు ఆడుతున్నారు అని చంద్రబాబు అన్నారు. మీకు తెలియకుండానే స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందా అని అడిగిన ఆయన వైసీపీ నాయకులు ప్రజలను మోసం చేయాలనికుంటున్నారు అని తెలిపారు. ప్రజా వేధిక విద్వంసం నుండి ప్రారంభించి,కూలగొట్టడం మొదలుపెట్టారు. రెండు సంవత్సరాలు గడ్డి పీకారు. ఏ2 పిచ్చి కుక్కలా తిరుగుతాడు. పాదయాత్ర చేస్తాడట,ఎవ్వరికి కావాలి నీ పాదయాత్ర అని అన్నారు.
previous post
చంద్రబాబు, లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు: రోజా