telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మూసాపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో పర్యటించిన కమిషనర్ రోనాల్డ్ రోస్

కూకట్ పల్లి జోన్ మూసాపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో  బుధవారం జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించారు.
ఈ సందర్బంగా మూసాపేట్ సర్కిల్ లోని దేన్ దయల్ కాలనీలో నాలా, సఫ్ దార్ కాలనీ నాలా, అమృత తండా, ఫతే నగర్ నాలా,  పరిశీలించారు. సున్నం చెరువు నాలాలో అక్రమంగా నిర్మాణాలు చేసిన వాటిని తొలగించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.
నాలా వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైన చోట రిటైనింగ్ వాల్ నిర్మాణాలు చేపట్టి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  జే.ఎన్.ఎన్.యు.ఆర్.యు.ఎం కాలనీలో చేపట్టిన 2BHK  డిగ్నిటీ కాలనీలను పరిశీలించారు. గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారా అని కమిషనర్ జోనల్ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.
సున్నం చెరువు నుండి మైసమ్మ చెరువు వరకు రీటైనింగ్ వాల్ ను  వైడేనింగ్ పనులు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, డిప్యూటీ కమిషనర్ రమేష్, జోనల్  ఎస్.ఈ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
————————————————————
*-సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారిచేయడమైనది.*

Related posts