telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్ పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ఇబ్రహీంపట్నం పరిధిలోని తిమ్మాయిగూడ లో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

అవినీతి, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ర్యాండమైజేషన్ పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ జరుగుతుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తిమ్మాయిడ లో నిర్మించిన 864 డబుల్ బెడ్ రూం ఇళ్లలో 500 ఇళ్లను యాకత్ పుర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. ఈ విడతలో డబుల్ బెడ్ రూం ఇల్లు రాని వారు నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో ఇంకా చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఐటీ, పరిశ్రమలు, భవన నిర్మాణ రంగాల్లో హైదరాబాద్ నగరం పురోగతిలో ఉన్నదని తెలిపారు. నిరుపేదలకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని మేయర్ తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల తో పాటు గృహలక్ష్మి పథకం ద్వారా సొంతిల్లు లేని వారికి ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నదని తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్ని మండలాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసిందని తెలిపారు.

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఈ రోజుల్లో ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం పేదవాడికి ఆర్థిక భారంతో కూడుకున్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతిగా వారికి ఉచితంగా సకల సౌకర్యాలతో ఇళ్లను నిర్మించి ఇవవ్డంతో పాటు ఆడ పిల్ల పిళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తలాబ్ చంచలం కార్పొరేటర్ సమీనా బేగం, ఎం.పి.పి బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జెడ్.పి.టి.సి బింగి దేవదాసు గౌడ్, వై.ఎస్ ఎం.పి.పి కొలను శ్రీధర్ రెడ్డి, ఎం.పి.టి.సి బీమగౌని భాస్కర్ గౌడ్, కుత్బుల్లాపూర్ గ్రామ సర్పంచ్ స్వరూప వీరస్వామి యాదవ్, ఉప సర్పంచ్ దేవుని మంగ, వార్డు మెంబర్లు పైట్ల నరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

——————————————-

సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts