telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ట్రంప్‌ కు మరో షాక్…

trump usa

ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్న డెమోక్రాట్లు… అభిశంసన తీర్మాన్ని సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌పై దాడి చేసేలా తన అభిమానుల్ని ట్రంప్‌ రెచ్చగొట్టారన్నది డెమోక్రాట్ల ఆరోపణ. దీంతో ట్రంప్‌ అభిశంసన దిశగా తొలి అడుగు పడింది. ఈ తీర్మానంపై బుధ, గురువారాల్లో  ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. అభిశంసన తీర్మానం సందర్భంగా అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ గురించి కూడా ప్రస్తావించారు డెమోక్రాట్లు. దాని ప్రకారం దేశంపై దాడి చేయడం లేదా, తిరుగుబాటుకు ప్రేరేపించిన వ్యక్తి అధికారిక హోదాలో కొనసాగే అవకాశం ఉండదు. అయితే, ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిందిగా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను ఆదేశించారు స్పీకర్‌ నాన్సీ పెలోసీ. రాజ్యాంగంలోని 25వ సవరణను అనుసరించి… అధ్యక్షుడ్ని పదవి నుంచి తొలగిస్తూ క్యాబినెట్లో మెజార్టీ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. ఒక వేళ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఆ పని చేయకపోతే… అభిశంసన తీర్మానంపై సభలో చర్చిద్దామన్నారు స్పీకర్‌. అంతకు ముందు… ట్రంప్‌పై డెమోక్రటిక్‌ ప్రతినిధులు డేవిడ్‌ సిసిలైన్‌, రస్కిన్‌, టెడ్‌ లియూ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని 25వ సవరరణను 24 గంటల్లోనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు డెమోక్రాట్లు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ ఈ నెల 6న క్యాపిటల్‌ భవనంలో సమావేశమైంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున్న ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాడి తర్వాత సొంత పార్టీ సభ్యుల నుంచి కూడా ట్రంప్‌ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

Related posts