telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మే డే…శ్రమ జీవి వర్ధిల్లాలి

కార్మికుడు ఒక శ్రామికుడు

శ్రమను నమ్ముతాడు చమట చుక్కలు చిమ్ముతాడు….

కడుపుకాలి కాయ కష్టం చేస్తాడు….

స్వేదం చింది కుటుంబాన్ని పోషిస్తాడు…

రైతు రాజ్యం అన్నారు డొక్కలెండిన రారాజును జాలిగా చూస్తారు….

జన్మభూమికి ప్రాణం తృణ ప్రాయమన్న జవానన్న శ్రామికుడే…

అన్నపూర్ణ నాదేశము గా పిలిపించిన రైతన్న శ్రామికుడే…

గూడూకట్టే తాపిమేస్త్రి, శ్రామికుడే

రాల్లెత్తి, ఇసుకమోసే రాధక్క శ్రామికురాలే…

శ్రామికులకొరోజంటూ పండుగ చేసి కూలి మానేసేది శ్రామికుడే…

రేపటికి రూపం లేక ఈరోజు గడవక పస్తులుండే శ్రామికునికి ఏమి చేసి ఋణం తిరుద్దామన్న ఖద్దరు చొక్కా యొచిoచడే…

యాచించిన వాన్ని చీదరిస్తారు…

కష్టించే వాడు ఆశిస్తే నీ కూలి ఇంతే అని గద్దిస్తారు….

కాలే కడుపును గుర్తించేదెవరు వాడిపోయే మొగ్గలు రాలకుండా చూసేదేవరు….

దళారీ రాజ్యంలో స్వేదం విలువ తెలిసేదెల…

కార్మిక శక్తి గుర్తించేదెల….

కార్మికుల రోజంటూ సెలవు చూపి పస్థులున్న డొక్కల ఆకలి మంటను చల్లార్చేదెల ఆలోచిద్దాం కామ్రేడ్ అంటూ గళం కలుపుడే కాదు శ్రమైక శక్తి సంఘటితంగా నలు దిశలచాటుదాం న్యాయం జరిగేలా నమ్మకం పెంచుదాం….!!

శ్రమ జీవి వర్ధిల్లాలి

శ్రమైక జీవనం ఫలించాలి..*

 

Related posts