telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

దూసుకెళ్తున్న భారత్.. రోహిత్ శర్మ రికార్డులు..

india towards success on srilanka

భారత ఆటగాడు రోహిత్ శర్మ ప్రపంచకప్ లో అద్భుతమైన రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు నమోదు చేశాడు. తద్వారా ఓ వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మన్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటివరకు ఇన్ని శతకాలు కొట్టిన మొనగాడు మరెవరూలేరు. ఇప్పటివరకు ఈ రికార్డు కుమార సంగక్కర పేరిట ఉంది. సంగా 4 సెంచరీలతో 2015 వరల్డ్ కప్ లో రికార్డు స్థాపించగా, రోహిత్ ఓ సెంచరీ ఎక్కువే కొట్టి సరికొత్త చరిత్ర లిఖించాడు. శ్రీలంకపై లీడ్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో శతకం చేయడం ద్వారా రోహిత్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.

రోహిత్ ఈ సెంచరీతో హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. టోర్నీలో రోహిత్ కి ఇది వరుసగా మూడో శతకం కావడం విశేషం. కాగా, సెంచరీ పూర్తయిన కాసేపటికే రోహిత్ అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 35 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 212 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 55 పరుగులు చేయాలి.

2019 వరల్డ్ కప్ లో రోహిత్ సెంచరీల జాబితా విషయానికి వస్తే; సౌతాంప్టన్ లో దక్షిణాఫ్రికాపై 122*, మాంచెస్టర్ లో పాకిస్థాన్ పై 140, బర్మింగ్ హామ్ లో ఇంగ్లాండ్ పై 102, బర్మింగ్ హామ్ లో బంగ్లాదేశ్ పై 104, లీడ్స్ లో శ్రీలంకపై 103.

Related posts