అమెరికా వారు అంగారుకుడుపై
ఆక్సిజెన్ సృష్టించారు….!
పైన చైనా వారు ప్రపంచాన్ని
అల్లకల్లోలం చేయాలని పూనుకున్నారు…
మనవారు రంపపు కోతతో,
చెట్లన్నీ కోసి రణరంగం చేశారు….**
పుడమి ప్రాణవాయువు లేక.!?
ప్రకంపనలతో కూసించుకుపోతుంది…..
ఇంకా కొన్ని దేశాలు వారు,
గుళ్ళతోను,ఫిరంగులతోను,
ఫిస్టళ్లతోను,పైచాశికత్వం….
భూమి గమన ఘడియలు తగ్గుతున్నాయి…
జనులు రోధనలతో చస్తున్నారు….!!!
మా”నవ”జాతి తెలివిలో త్రికరణశుద్ది లేదు…
తెగబడిపోయారు తన్నుకుంటున్నారు…
దరిద్రందిగువవారు చీకుచింత లేకుండా ఉన్నారు…
దేశాలన్నీ శృంఖనాదాలు చేస్తున్నాయి…
క్రొత్త గాలిని ప్రరాద్రోలాలని…..***
పృథ్విన పుట్టిన జీవులను చంపుతున్నారు.!!
రోగులను కాపాడాలని…….
దేవుడు చూస్తున్నాడట.! నైవేద్యాల వైపు….
విషాపురుగులు దూదిపింజలు తింటున్నాయి…
పవనంకోసం మనుషులంతా,
కాష్టంలో బారులు తీరుతున్నారు……
“కలి”వీరందరికి కాటికాపరిగా ఉన్నాడు…
ఇప్పుడు ఆకలి చావులు లేవు..!,
క్రొత్త జబ్బులు రానే రావు……….
ఉన్నవన్నీ మేధావుల మాటలతోనే….!!.?
అప్పుడు అరగంటకో సంక్షోభం..!
ఇప్పుడంతా”కొత్తకరోన”భయం….
“ప్రకృతి”సౌందర్యాన్ని కోలిపోయింది….
పత్రికల్లో పిచ్చివ్రాతలు ఎక్కువయ్యారు..?
మీడియాలో అతివాదులు ఎక్కువయ్యారు..?
మాటలన్నీ కొత్తభూచిల కోసమే..!!..**
నేతలు రాజీపడుతున్నారు..!!
జన”కరోన”అరణ్యంలో తిరగలేక..*****
కొత్త ఘడియలు జేగంటలు
కొట్టి శబ్దాలు చేసున్నాయి……
భూమిమీద సృష్టించబడిన ఐదుగురు
దేవుళ్ళు మూతి మూసుకు కూర్చున్నారు….
ధరిత్రికి అంతిమ యాత్ర జరుగుతుందని…
అంతానికి అంతిమ ఘడియలు అవుతాయేమో…