పుల్వామా వద్ద సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్తాన్ వేదికగానే జరిగినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. రావల్పిండిలోని ఓ ఆసుపత్రిలో తనకున్న ప్రాణాంతక రోగానికి చికిత్స పొందుతూనే, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సూచనలు ఇచ్చినట్లు గుర్తించారు.
దాడికి వారం రోజులకు ముందుగానే మసూద్ నుంచి ఓ ఆడియో సందేహం ఉగ్రవాదులకు అందింది. ఓ ఉగ్రవాదిని ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసిన తరువాత బ్దుల్ రషీద్ ఘాజీ భారీ బాంబును తయారు చేసి ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ లో అమర్చాడు. గతేడాది భద్రతా దళాల చేతిలో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైనది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా కశ్మీర్ యువతను రెచ్చగొట్టినట్లు బహిర్గతమైంది.
ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదు: యనమల