telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిగ్రీ, ఇంటర్ పరీక్షలు రద్దు

exam hall

ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోండి. డిగ్రీ, ఇంటర్ పరీక్షలను రద్ద చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు పాఠశాలలు, కళాశాలలు క్వారంటైన్ కేంద్రాలుగా మారాయి. ఇటువంటి పరిస్థితిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యే పనికాదని ఢిల్లీ ప్రభుత్వం భావించింది.

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జరగాల్సిన చివరి సంవత్సరం పరీక్షలు కూడా ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రం పరిధిలోకి వచ్చే ఐపీ విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం, డీటీయూ, అన్ని ఇతర సంస్థల్లో పరీక్షలు ఇక ఉండవు.

Related posts