వైసీపీ అధినేత జగన్ తాత బీసీలను బతకనివ్వలేదనీ ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను రాజరెడ్డి ఫ్యామిలీనే ఫ్యాక్షన్ రక్కసికి బలి చేసిందని మండిపడ్డారు. వైఎస్ అయితే బీసీలను జైళ్లలో పెట్టించారని విమర్శించారు. వైఎస్ అధికారంలో ఉండగా జగన్ ఏనాడూ బీసీల గురించి మాట్లాడలేదన్నారు.ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని యనమల మండిపడ్డారు.
బీసీలను టీడీపీకి దూరం చేసేందుకు వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయనీ విమర్శించారు. ఆ కుట్రాలను ప్రజలే తిప్పికొడతారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాతే అసలు బీసీలకు గుర్తింపు వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. పేద కుటుంబాలను ముఠా కక్షలకు బలిచేసి, ఇప్పడు అధికార కాంక్షతో జగన్ కొంగజపం చేస్తున్నారని దుయ్యబట్టారు.
పవన్ కళ్యాణ్ పై లక్ష్మీ పార్వతి ఫైర్