దేశంలో రక్షణ కొన్ని రాష్ట్రాలలో మరీ దిగజారిపోయింది చెప్పేందుకు మరో స్పష్టమైన ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. తప్పును ఆపినందుకు మహిళను దారుణంగా హింసించి, అవమానించారు. ఇలాంటి దారుణాలకు ఒక రాష్ట్రము అడ్డాగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.. అలాంటి రాష్ట్రాల జోలికి వెళితే నాయకులకు సైతం పుట్టగతులు ఉండవనే భయం ఉందేమో, అక్కడ నేరాలను అరికట్టే ప్రయత్నాలు ఏమి కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఉండటం దారుణమని మహిళా సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన ఆ రాష్ట్రంలో నేర ప్రవృతి ఎంత తీవ్రంగా ఉందొ తెలియజెప్పింది. ఈ రాష్ట్రం దారుణాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఈవ్-టీజింగ్ చేసిన యువకుడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో సదరు మహిళ ఘోర అవమానానికి గురైంది. సదరు మహిళ ఇంటికెళ్లిన యువకుడు సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడు. ఆమె ఇంటికి వెళ్లి.. ఆమెను ఇంటి నుంచి లాక్కొచ్చి.. వివస్త్రను చేసి నడి బజార్లో పరుగులు పెట్టించాడు. ఈ ఘటన యూపీలోని భడోహి జిల్లా గోపీగంజ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శనివారం పూట ఓ మహిళను బజారు వద్ద ఓ యువకుడు అడ్డగించి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అతడిని ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె అతడిని హెచ్చరించింది. దీంతో అక్కడ నుంచి అవమానభారంతో వెనుదిరిగిన యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆపై స్నేహితులను వెంటబెట్టుకుని.. ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చాడు. ఆమెపై దాడి చేశాడు. వివస్త్రను చేసి వీధుల్లో పరుగులు పెట్టించాడు. భయంతో రోడ్లపై పరుగులు పెడుతున్న ఆమెను రక్షించాల్సిన స్థానికులు ఫొటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటువంటి సందర్భాలను ఇక మీదట పునరావృత్తి కాకుండా ఉండాలంటే సమాజంలో మార్పు రావటం అత్యవసరం, లేదంటే బాధితులలో వారిపేరు ఏదో ఒక రోజు ఉంటుంది. నాడు అయ్యోపాపం అనేవారు ఉండరు. అప్పుడు దానిని రాక్షస రాజ్యం అంటారు, ప్రజాస్వామ్యం అనరు.