telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ నిర్మాతగా “మీకు మాత్రమే చెప్తా”

Vijay-Devarakonda

టాలీవుడ్‌ సెన్సేషన్ల్ హీరో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా తన సొంత బ్యానర్ “కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌” పతాకంపై నిర్మించబోతున్న చిత్రంలో దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి “మీకు మాత్రమే చెప్తా” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను వినూత్నంగా వీడియో ద్వారా ప్రకటించారు విజయ్‌ దేవరకొండ. క్రికెట్‌ అడుతున్న తరుణ్‌భాస్కర్‌కు విజయ్‌ దేవరకొండ ఫోన్‌ చేసి “నేను ఇప్పుడే ఓ స్క్రిప్ట్‌ విన్నా. బాగా నచ్చింది. నవ్వుకున్నా. ఆ దర్శకుడు, వారి టీమ్‌ చూస్తే ‘పెళ్లిచూపులు’ సమయంలో మనమే గుర్తుకొచ్చాం. అందులో హీరో నువ్వే. నా సేవింగ్స్‌ అన్ని ఈ సినిమాలో పెడుతున్నా” అని చెప్పడం ఆసక్తిని పెంచింది. ఈ సినిమా టైటిల్‌ ఏంటి అని తరుణ్‌ అడగ్గా..విజయ్‌ “మీకు మాత్రమే చెప్తా” అంటూ సినిమా టైటిల్ ను వినూత్నంగా వెల్లడించారు. “సినిమాను నిర్మించడం ఎంత కష్టమో, రిస్క్‌తో కూడుకున్నదో తెలుసు. ఛాలెంజ్‌ లేకపోతే జీవితానికి అర్థం లేదు” అంటూ వీడియోతో పాటు కామెంట్ పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ.

Related posts