ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ లో బిల్లులు పాస్ కాకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నట్టు సీఎం జగన్ భావించడం దారుణమని అన్నారు. నీ ఎమ్మెల్యేలు నీకు ఊడిగం చేస్తారు. నువ్వు ఏం చెబితే అది ‘ఎస్’ అంటారు. నువ్వు ఏమన్నా వాళ్లు పడతారు. నీ భయంతో మీ వాళ్లందరూ వణికి పోతున్నారని దుయ్యబట్టారు.
తెలుగుదేశానికి ఆ దరిద్రం పట్టలేదని, వారు వీరోచితంగా పోరాడతారన్నారు. నా దగ్గర ఏమన్నా చెప్పాలంటే నిర్మొహమాటంగా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చెబుతారు. అందుకే, ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేస్తాంమని స్పష్టం చేశారు. మండలిని రద్దు చేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి లేదు. తీర్మానం చేస్తే కేంద్రం కూడా ఆమోదించాలని ఎక్కడా లేదని తెలిపారు.సెలెక్ట్ కమిటీ అవుట్ కమ్ కూడా రావాల్సిన అవసరం ఉందని ఏజీ అఫిడవిట్ ఫైల్ చేశారు. అక్కడ కూడా డ్రామా ఆడాలని చూశారని వైసీపీ పై మండిపడ్డారు.
కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్లపై కేసులా ?: విజయశాంతి