telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

మళ్ళీ 2018 నే .. స్వాగతించిన .. ఆస్ట్రేలియా..

Australia welcomes 2018 again

నూతన ఆంగ్ల సంవత్సరాది నాడు భారీగా వేడుకలకు సిద్ధం అవుతాయి, ఆయాదేశాలు. అయితే ఇవి భారీ వేడుకలు కాబట్టి అందులో చిన్న చితకా లోపాలు జరగటం సహజం. అలాంటిదే తాజా వేడుకలలో చోటుచేసుకుంది. నిజానికి ఆస్ట్రేలియా వాసులు ఇంకా 2017లోనే ఉన్నారేమో, అందుకే 2018కి స్వాగతం పలికారు. వారు వేడుకలలో అలాగే పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం 2019 సంవత్సరాన్ని ఆహ్వానిస్తే ఆస్ట్రేలియా మాత్రం 2018కి స్వాగతం పలికింది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై ‘హ్యాపీ న్యూ ఇయర్ 2018’ అంటూ పెద్ద సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. అయినప్పటికీ తప్పును గ్రహించని సిడ్నీ వాసులు అలాగే సంబరాలు చేసుకున్నారు. తప్పు జరిగిపోయిందని, నిజానికి అది 2019 అని తమకు తెలుసని ఆ తర్వాత తీరిగ్గా చెప్పుకొచ్చారు.

విద్యుద్దీపాలతో సిడ్నీ హార్బర్ బ్రిడ్జిని శోభాయమానంగా అలంకరించిన అధికారులు ‘హ్యాపీ న్యూ ఇయర్ 2018’ అని తాటికాయంత అక్షరాలతో రాశారు. పది లక్షల మంది అక్కడే బాణసంచా కాల్చి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఉత్సాహంగా చిందులేశారు. అయితే, వీరిలో ఏ ఒక్కరు తప్పును గ్రహించకపోవడం విశేషం. ఆస్ట్రేలియా మొత్తంలో న్యూ ఇయర్ వేడుకలను ఇక్కడే ఘనంగా నిర్వహించారు. సిడ్నీ హార్బర్‌లో జరిగే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటిది అక్కడే ఘోర తప్పిదం జరిగినా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. చివరికి ఓ వ్యక్తి తప్పును గుర్తించి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సిడ్నీ ప్రజలు మాత్రం అది చిన్న తప్పేనంటూ వాళ్ళ దేశాన్ని వెనకేసుకొస్తున్నారు. ఎంతైనా ఎవరిదేశం వారికీ ముద్దు.

Related posts