telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించండి.. లేదంటే ఆందోళనకు దిగుతాం.. : మోహన్ బాబు

mohanbabu fires on ap govt for reimbursement

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. లేకుంటే ఆందోళన చేపడతామని సినీ నటుడు మోహన్‌బాబు హెచ్చరించారు. తిరుపతిలో మీడియాతో సినీ నటుడు మోహన్‌ బాబు మాట్లాడుతూ… చంద్రబాబు తనకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్‌ కళాశాల గొప్పదని చంద్రబాబే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. 2014-15 సంవత్సరం నుండి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలున్నాయన్నారు. చంద్రబాబు పాలసీలు ప్రవేశపెడతారు, కాని విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

17-18 కొత్త రూల్‌ పెట్టారని, 3 మాసాలకు ఓసారి చెల్లిస్తామని చెప్పారు. ఇంత వరకు చెల్లించలేదని, భిక్షం వేసినట్లు కొద్దిగా చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.16 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఆస్తులు తాకట్టు పెట్టి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. ఏ రాజకీయ పార్టీ ప్రోత్సాహంతోనూ తాను మాట్లాడడం లేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు. తాను రాజకీయం కోసం మాట్లాడలేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని మోహన్‌బాబు హెచ్చరించారు.

Related posts