telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

సోషల్‌ మీడియా పోస్ట్‌తో కశ్మీర్‌ విద్యార్థినుల అరెస్ట్‌

 Kashmir Students arrested whatsapp
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకోవాలంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నలుగురు జమ్మూ కశ్మీర్‌ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఈ నలుగురు విద్యార్థినులను వర్సిటీ సైతం సస్పెండ్‌ చేసింది.
వాట్సాప్‌లో దేశ వ్యతిరేక సందేశాన్ని షేర్‌ చేసినందుకు వారిని సస్పెండ్‌ చేసిన యూనివర్సిటీ అధికారులు అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. విద్యార్థినుల చర్యను తీవ్రంగా ఖండించిన నిమ్స్‌ యూనివర్సిటీ ఈ తరహా కార్యకలాపాలను వర్సిటీ సహించదని, వీరిని కాలేజ్‌తో పాటు హాస్టల్‌ నుంచి సస్పెండ్‌ చేశామని వెల్లడించింది. విద్యార్థినులను తల్వీన్‌ మంజూర్‌, ఇక్రా, జోహ్ర నజీర్‌, ఉజ్మా నజీర్‌గా గుర్తించారు.

Related posts