telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాస్తవాలు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలి: కేసీఆర్

Kcr telangana cm

ఈ నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో మంత్రులు, విప్ లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై ఎన్నిరోజులైనా సరే చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

ప్రజలకు సంబంధించిన ప్రతి విషయం సభలో చర్చకు రావాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, తిట్లు, శాపనార్థాలు కాదని అన్నారు. పనికిమాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదని సీఎం అభిప్రాయపడ్డారు. చర్చలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు వెల్లివిరిసేలా సభా సమావేశాలు జరగాలని ఉద్ఘాటించారు.

కరోనా వ్యాప్తి-నివారణ, కరోనా బాధితులకు వైద్య సేవలు, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం-సహాయక చర్యలు, శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటన, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, నీటి పారుదల రంగం, నియంత్రిత పద్ధతిలో పంటలసాగు తదితర అంశాలపై సభలో చర్చించనున్నారు.

Related posts