telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ ఫాలో ఆన్ చేయకపోవడానికి కారణం…?

టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ భయంతోనే తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదని ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించినా.. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే రిషభ్ పంత్ భయంతోనే తాము అలా చేశామని జోరూట్ చెప్పుకొచ్చాడు. “పంత్​ ఒక్క సెషన్​ ఆడినా అద్భుతాలు చేస్తాడు. అయినా నేను వికెట్లు పడగొట్టాలని అనుకోలేదు. మా బౌలర్లు వికెట్లు ఎలా తీయాలనే విషయమై ప్రత్యామ్నాయ దారులు కనుగొంటారని ఆశించాను. మేము అవకాశాలను సృష్టించుకోవాలనుకున్నాము. అందుకే డిక్లేర్​ చేయలేదు.” అని రూట్​ తెలిపాడు.

ఇంగ్లండ్ పేసర్​ బౌలర్​ జేమ్స్​ అండర్సన్​పై రూట్ ప్రశంసల జల్లు కురిపించాడు. ​అతనిలాంటి సీనియర్​ ఆటగాడు ఉండటం వల్ల తన పని సులువైందని అన్నాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్​లో ఒకే ఓవర్‌లో శుభ్‌మన్ గిల్, రహానేను ఔట్ చేసిన అండర్సన్ భారత్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. అయితే అండర్సన్ వేసిన ఈ ఓవర్ 2005 యాషెస్​ సిరీస్​లో ఇంగ్లండ్​ మాజీ క్రికెటర్​ ఫ్లింటాఫ్​ ఆడిన ఆటతీరును గుర్తుచేసిందన్నాడు. ఆ సిరీస్​లో ఫ్లింటాఫ్​.. ఆసీస్​ మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్​, జస్టిన్​ లాంగర్​ను ఓకే ఓవర్​లో మూడు బంతుల తేడాలో పెవిలియన్​ చేర్చాడు. అదే సంఘటన తనకు గుర్తుకు వచ్చిందన్నాడు. అతనిది కష్టపడే వ్యక్తిత్వమని కొనియాడాడు. కోహ్లీ వికెట్​ను తీసిన స్టోక్స్​ను కూడా కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

Related posts