telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఆలస్యంగా వస్తే.. ఖర్చు పెట్టాల్సిందే.. : ధోని

40000 dhoni fans allowed to ipl practice match

మాజీ కోచ్ ప్యాడీ అప్టన్, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ప్యాడీ అప్టన్ కొన్నాళ్లూ టీమిండియాకు సైకాలజీ కోచ్‌గా ఉన్నారు. ప్లేయర్ల మానసిక స్థితిని ఆయన అంచనా వేసేవారు. టెస్టు జట్టుకు అనిల్ కుంబ్లే, వన్డే జట్టుకు ధోనీ కెప్టెన్లుగా ఉన్న రోజుల్లో ప్యాడీ అప్టన్ మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా చేశారు. ఒకవేళ ప్లేయర్లు ట్రైనింగ్ కోసం కానీ, టీమ్ సమావేశాలకు కానీ ఆలస్యంగా వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చ వచ్చింది. అప్పుడు టెస్టు కెప్టెన్ కుంబ్లే ఓ సూచన చేశాడు. ఆలస్యంగా వచ్చే ప్లేయర్‌కు పదివేల రూపాయల జరిమానా విధించాలన్నాడు. ఈ ప్రతిపాదనను ప్లేయర్లు అంగీకరించినట్లు ప్యాడీ అప్టన్ చెప్పారు.

వన్డే టీమ్ విషయానికి వస్తే, ఏం చేయాలన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. టీమ్ మీటింగ్స్‌కు ప్లేయర్లు ఎవరైనా ఆలస్యంగా వస్తే ప్రతి ప్లేయర్ పది వేల జరిమానా కట్టాలని ధోనీ సూచించినట్లు ప్యాడీ అప్టన్ తెలిపారు. ధోనీ ఎప్పుడైతే పది వేల ఫైన్ ఐడియా ఇచ్చాడో.. అప్పటి నుంచి ఒక్క ప్లేయర్ కూడా ఆలస్యంగా రాలేదని ప్యాడీ వెల్లడించారు. టీమ్ విజయాల్లో ధోనీ ఐడియా బాగా వర్కౌటైనట్లు చెప్పారు. మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా సాగుతున్నా.. ధోనీ చాలా మనోనిబ్బరంతో ఆటను ఆడుతాడని, అదే అతని శక్తి అని ప్యాడీ తెలిపాడు. మిగితా ప్లేయర్లు కూడా కూల్‌గా ఉండేలా చేస్తాడన్నాడు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్యాడీ ఈ విషయాలను వెల్లడించారు.

Related posts