telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇర్ఫాన్ అద్భుత‌మైన వ్య‌క్తి… : దీపికా పదుకొనె

Deepika

బాలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌తో ఏప్రిల్ 29న ఇర్ఫాన్‌ఖాన్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం అభిమానులను, సెలెబ్రిటీలను సైతం కుదిపేసింది. అయితే ఆయన భౌతికంగా దూర‌మైనా, ఆయ‌న పోషించిన పాత్ర‌లు అభిమానుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. ఇర్ఫాన్ న‌టించిన అపురూప‌మైన చిత్రం పీకూ. దీపికా పదుకొనె అమితాబ్ బ‌చ్చ‌న్ ల‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. పీకూ చిత్రం విడుద‌లై నేటికి స‌రిగ్గా ఐదేళ్ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఇర్ఫాన్‌తో ఉన్న మ‌ధుర స్మృతుల‌ను దీపిక సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. “ఇర్ఫాన్.. అద్భుత‌మైన వ్య‌క్తి. నాకెంతో ఇష్ట‌మైన వ్య‌క్తి” అంటూ పోస్ట్ చేశారు. దీపికా ప‌దుకొణె న‌టించిన మొద‌టి హాలీవుడ్ చిత్రానికి సంబంధించి ఓ వేడుక‌లో ఇర్ఫాన్, దీపిక హాజ‌రైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 

View this post on Instagram

 

Those special moments ❤ #irrfankhan with #deepikapadukone 🎼 @hrithikroshan . . . #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Related posts