telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

200 వికెట్ల క్లబ్‌లో .. రవీంద్ర జడేజా ..

ravindra jadeja in 200 wickets club

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. సఫారీ బ్యాట్స్‌మన్‌ ఎల్గర్‌ను ఔట్‌ చేసి ఈ ఘనత అందుకున్నాడు. 44 టెస్టుల్లోనే జడేజా 200 వికెట్లు పడగొట్టాడు. అతడి తర్వాతి స్థానాల్లో శ్రీలంక బౌలర్‌ హెరాత్‌ (47), ఆసీస్‌ పేసర్లు జాన్సన్‌ (49), స్టార్క్‌ (50), పాక్ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌ (51) ఉన్నారు.

భారత్‌ తరఫున వేగంగా 200 వికెట్ల తీసిన రెండో ఆటగాడిగానూ జడేజా రికార్డు సాధించాడు. అగ్రస్థానంలో రవిచంద్ర అశ్విన్ (37 టెస్టులు) ఉన్నాడు. ఈ రికార్డులో దిగ్గజ స్పిన్నర్లు అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌, బీఎస్ చంద్రషెహర్‌ను జడేజా అధిగమించడం విశేషం. 200 వికెట్ల క్లబ్‌లో చేరిన 10వ భారత్‌ బౌలర్‌గా అతడు నిలిచాడు.

Related posts