telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జేసీలకు మార్గ‌నిర్దేశం చేసిన సీఎం జగన్…

జేసీలకు మార్గ‌నిర్దేశం చేసారు సీఎం జగన్. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ క‌ట్ట‌లేద‌ని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేద‌న్న ఆయ‌న‌.. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.. 17 వేల లే అవుట్స్‌లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం.. కొన్ని లే అవుట్స్‌ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి.. అధికారులంతా అందరికీ ఇళ్లు పథకం అమలుకోసం విశేషంగా ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు.. అయితే, నిర్ణీత సమయాల్లోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాల‌న్న ఏపీ సీఎం.. అంతేకాదు అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు.. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా వారికి ఇంటి పట్టాలు అందాల‌ని పేర్కొన్న ఆయ‌న‌.. శాచ్యురేషన్‌ పద్ధతిలో వారికి ఇంటి పట్టాలు అందించాలి.. అర్హులు 100 మంది ఉంటే.. 10 మంది ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడద‌న్నారు. ఎవరైనా మిగిలిపోతే వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించాల‌న్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఇలా ఇళ్లపట్టాలు అందుకున్నవారికి ఇళ్లుకూడా ఇవ్వాల‌న్నా య‌న‌.. ప్రతి ఏటా కూడా ఇలా పట్టాలు అందుకున్నవారికి ఇళ్లుకట్టించాల్సిన అవసరం ఉంటుంద‌న్నారు.. పేదవాడి సొంతింటికలను నిజంచేసే దిశగా అడుగులు వేస్తున్నామ‌న్న సీఎం… దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన అంశం.. ఇళ్లనిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారొద్ద‌ని ఆదేశించారు

Related posts