telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అనకాపల్లి జిల్లాలో దారుణం….. ఆరేళ్ల చిన్నారిపై పక్కింటి 3‌0ఏళ్ల యువకుడు అత్యాచారం

*అనకాపల్లి జిల్లాలో దారుణం..
*న‌ర్సీప‌ట్నంలో ఆరేళ్ల చిన్నారిపై రేప్‌..
*చిన్నారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన త‌ల్లిదండ్రులు..
*సాయి అనే యువ‌కుడుపై త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు..

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా మహిళలు, బాలికలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్ర‌భుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. చట్టాలు చేసినా.. మార్పు క‌నిపించ‌డంలేదు.. అన్యం పుణ్యం తెలియని చిన్నారులపై కామంతో క‌ల్లు ముసుకుపోయి దారుణానికి ఒడిగ‌డుతున్నారు. తాజాగా అనాక‌ప‌ల్లిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుండగుడు..

వివరాల్లోకి వెళితే..

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 3వ వార్డులో బుద్ది సాయి(30) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాయి. అతడి ఇంటిపక్కనే ఇద్దరు అక్కాచెల్లెల్లు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు

గ‌త య‌చ‌, య‌ రాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెలు బహిర్భూమికి వెళ్లారు. దీంతో.. బయటకు వచ్చిన సమయంలో బాలికను లాక్కెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని తల్లిదండ్రులకు బాలిక వచ్చి చెప్పింది.

దీంతో హుటాహుటినా తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలలో చిన్నారి జాడ కోసం వెతికారు. దీంతో రక్తస్రావంతో అపస్మారకస్థితిలో తల్లిదండ్రులకు బాలిక కనపడింది. వెంటనే బాలికను ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

అయితే.. పక్కింట్లో ఉంటున్న సాయి అత్యాచారం చేశారంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు

 

Related posts