telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే!

minister bosta in vijayawada meeting

2019-20 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం వ్యవసాయశాఖ వార్షిక బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే గురువారం ఆయన సోదరుడు సురేశ్‌ గుండెపోటుతో మృతి చెందడంతో కన్నబాబు స్వగ్రామానికి వెళ్లారు. ఆయన బదులు మంత్రి బొత్స వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు:
9గంటల ఉచిత విద్యుత్‌కు రూ.4525 కోట్లు
రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం-రూ.27,946 కోట్లు
పెట్టుబడి వ్యయం- రూ.919 కోట్లు
ప్రకృతి వ్యవయసాయానికి రూ.91 కోట్లు
వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం-రూ.3,626 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం- రూ.8750 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా- రూ.1163 కోట్లు
వడ్డీ లేని రుణాల కోసం- రూ.100 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతు బీమాకు- రూ.100 కోట్లు
ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.460 కోట్లు
రైతు సంక్షేమం- వ్యవసాయ విభాగ అభివృద్ధికి రూ.12,280 కోట్లు
ఎన్‌జీరంగా వర్సిటీకి రూ.355 కోట్లు
ఉద్యానవనశాఖ- రూ.1532 కోట్లు
ఉద్యాన వర్సిటీకి రూ.63 కోట్లు
పట్టు పరిశ్రమకు రూ.158 కోట్లు
పశుసంవర్థకశాఖకు రూ.1240 కోట్లు
పాల సేకరణ కేంద్రాలకు రూ.100 కోట్లు
పశు నష్టపరిహారం పథకానికి రూ.50 కోట్లు
2 పశు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం రూ.75 కోట్లు
పౌల్ట్రీ రంగానికి రూ.50 కోట్లు
ఎస్వీ పశు వైద్య విద్యాలయం రూ.87 కోట్లు
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 100 కోట్లు
ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ- రూ.70 కోట్లు
మత్స్యశాఖ అభివృద్ధికి రూ.409 కోట్లు
మార్కెటింగ్‌శాఖకు రూ.3,012 కోట్లు

Related posts