telugu navyamedia
వార్తలు

వామ్మో ఆద‌మ‌రిస్తే ఇక అంతే..!

మళ్లీ క‌ల‌వ‌ర‌పేడుతున్న క‌రోన మ‌హ‌మ్మారి..!

క‌రోనా కేసులు మ‌ళ్లీ ఎక్కువ‌తున్నాయి. రెండో ద‌శ వెళ్ళిపోయిందిగా ఇక ఏమీ కాద‌న్న నిర్ల‌క్షం, క‌నీసం మాస్క్ కూడా ధ‌రించ‌క‌పోవ‌డం, భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డం వ‌ల‌నే క‌రోనా మ‌హమ్మారి మ‌ళ్ళీ క‌ల‌వ‌ర‌పేడుతుందని, క‌రోనా నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డం వ‌ల‌నే కేసులు ఎక్కువ‌తున్నాయ‌ని వైధ్యులు అంచ‌నా వేస్తున్నారు.

ఇదే నిర్లక్ష్యం కొన‌సాగితే థ‌ర్డ్‌వేవ్ భారిన ప‌డాల్సివ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోప్ర‌క్క క‌రోనా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతూనే ఉంది. క‌రోనా త‌గ్గింద‌న్న ఉద్దేశంతో చాలా ఆస్పత్రుల్లో ప‌డ‌క‌ల‌న్నీ సాధార‌ణ రేగులు చికిత్స‌కోసం కేటాయించారు. ఇంత‌లోనే క‌రోనా జంట న‌గ‌రాల్లో విజృంభున మొద‌లైంది.

ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 4,03,840గా ఉన్నాయి. అంతేకాగా కేర‌ళ‌లో 22వేల‌కేసులు, మ‌హారాష్ర్ట‌లో 6,857 కేసులు భ‌య‌ట‌ప‌డ్డాయి. దేశంలో న‌మోదు అవుతున్న కొత్త కేసుల్లో ఈ రాష్ర్టాల్లో ఎక్కువగా క‌రోనా కేసులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాగా హైద‌రాబాద్ గాంధీలో రోజుకు 30 కేసులు న‌మోదు అవుతున్న‌ట్లు తెలుస్తుంది.

Related posts