కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో సీఎం కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. మీడియాతో కుమారస్వామి మాట్లాడుతూ, అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఇందుకోసం సమయం కేటాయించాలని స్పీకర్ ను కోరారు.
విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలనే నిర్ణయానికి తాను వచ్చానని తెలిపారు. అధికారంలోనే ఉండాలని తాను భావించడం లేదని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేల కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొందన్నారు. బీజేపీ తేరుకోకముందే విశ్వాసాన్ని నిరూపించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.