*అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలి..
*అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలి
*అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దని
*రాజధానిపై ఇప్పటివరకు 125 ఫిటిషన్లు దాఖలు..
*పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలి
ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై గురువారం హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోర్టు తేల్చిచెప్పింది. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని పేర్కొంది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది..
6 నెలల్లో రాజధాని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. 3 నెలల్లో భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని తెలిపింది.ప్రభుత్వానికి శాసనాధికారం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వవద్దని పేర్కొంది.
అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖాకు వీల్లేదని కోర్టు వెల్లడించింది. రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తెలిపింది.
6 నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంది ఏపీ హైకోర్ట్. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు.
అంతేకాకుండా రాజధానిపై ఇప్పటివరకు 125 ఫిటిషన్లు దాఖలు అయ్యాయని.. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది
దీంతో అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రైతులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణం బయట సాష్టాంగ నమస్కారం చేశారు. హైకోర్టు ముందు నిలబడి తీర్పుపై కృతజ్ఞతలు తెలిపారు. మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు. రాజధాని గ్రామాల్లో సంబురాలు జరుపుకున్నారు.
భూదందా కోసమే రాజధాని మార్పు: కన్నా