telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటక మంత్రి కేసులో మరో ట్విస్ట్..

ఉద్యోగం కావాలని తన దగ్గరకు వచ్చిన యువతితో రాసలీలలు సాగిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జర్కిహొళి. వీడియోలు బయటకు రావడంతో జార్కిహోలి కామకేళి బండారం మొత్తం బయట పడింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో హోలి గారు రాజీనామా చేశారు. అవమానంతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. కానీ, ఇప్పుడు ఇదే సెక్స్‌ స్కాండిల్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో మంత్రి రమేష్‌ రాసలీలల వ్యవహారం వెలుగు చూడగా.. ఇప్పుడదే సామాజిక కార్యకర్త, ఫిర్యాదు దారు దినేశ్ కలహళి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయ పెద్దల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. అయితే, బాధితురాలి పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతుండటంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు దినేష్‌ కలహళి. ఇందులో భాగంగా ఓ లేఖను తన న్యాయవాది ద్వారా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఫిర్యాదు ఉపసంహకరించుకోవడం వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. చూడాలి మరి ఈకేసులో ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts