telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశంలో అత్యంత దగా పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ : సీఎం జగన్‌

cm jagan

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, పాల్గొన్నారు. అయితే..ఈ సందర్భంగా సీఎం జగన్‌ మట్లాడుతూ..దేశంలో ఏ రాష్ట్రమూ పడనంతగా ఆంధ్రప్రదేశ్ దగా పడిందని ఆయన పేర్కొన్నారు. సొంత రాష్ట్రం వారు..బయటి వారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెన్నుపోటులు పొడిశారని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఏపీ ఎన్నో దయనీయ పరిస్థితులను చూసిందని తెలిపారు. వైసీపీ పాలనలో గ్రామాల రూపురేఖలు మార్చుస్తున్నామని పేర్కొన్నారు. కొందరు కులం పిచ్చితో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఎందరో త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.

Related posts