మన పాలకులు ఎన్ని గొప్పలు చెప్పినా.. కొన్ని ఘటనలు సమస్యలకు అద్దంపడుతూనే ఉన్నాయి.. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది… విషయం ఏంటంటే.. తమ సమస్య తీవ్రతపై చర్చ జరిగేందుకు.. ఎన్నికలు జరుగుతోన్న సమయాన్నే ఎంచుకున్నారు దర్బంగాలోని ఓ పోలింగ్ బూత్ పరిధిలో ప్రజలు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని దర్బంగా జిల్లాలో ఓ గ్రామం పక్కనే చిన్న నది ప్రవహిస్తుంటుంది.. అయితే, నది అవతలి వైపు కూడా కొంతమంది నివాసం ఉంటున్నారు.. ఎలాంటి వంతెన లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాళ్లు బయటకు రావడానికి గానీ.. ఇవతలివారు అక్కడికి చేరుకోవడం కానీ అసాధ్యం.. అయితే, ఈ సమస్యను ఎన్నిసార్లు స్థానిక నేతలు, అధికారులకు విన్నవించినా ఉపయోగంలేకుండా పోయింది.. తాజాగా కురిసిన వర్షాలతో కూడా వారికి కష్టాలు తప్పడంలేదు.. దీంతో.. అక్కడివారు ఓటుహక్కు వినియోగించుకోవడం సవాల్‌గా మారింది.. దీనిని తమ సమస్య తీవ్రతను తెలియజేసేందుకు అస్త్రంగా భావించిన స్థానికులు.. వారే స్వయంగా తాత్కాలిక వంతెన నిర్మించారు.. ఆ వంతెన మీదుగా సమీపంలోని పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.. చేతిలో ఓటర్ ఐడీ పట్టుకుని.. ఆ వంతెనను దాటుతూ.. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
previous post
next post