telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గణేష్‌ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషిన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందని, నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

కొవిడ్‌ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది.

Related posts