telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం..

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ఇప్పటికే ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు.

CM YS Jagan Launches Disha Patrolling Vehicles for Women Protection - Sakshi

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మహిళలకు అన్యాయం జరిగితే వైసీపీ ప్రభుత్వం ఊరుకోదని , మహిళలు, చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం వెల్లడించారు.

 

1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్‌ ఉందని.. ప్రమాదంలో ఉన్నప్పుడు చేతిలోని సెల్‌ఫోన్‌ను ఐదు సార్లు ఊపితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో పోలీస్లు అక్కడికి చేరుకుంటారని వెల్లడించారు.

 

మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికే దిశ పోలీస్‌స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.

Related posts