telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నారా బదులు సారా అంటే సూట్ అవుతుంది -జ‌గ‌న్‌

రాష్ట్రంలో తమ ప్రభుత్వం మద్యానికి సంబంధించి ఒక్క కొత్త బ్రాండ్ కు కూడా అనుమతి ఇవ్వలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

ఏపీ అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో చీప్ లిక్కర్ లేదని, రాష్ట్రప్రభుత్వమే ప్రాసెస్డ్, డిస్టిల్డ్ లిక్కర్ అమ్ముతోందని జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఎన్నో మద్యం బ్రాండ్లను అనుమతి ఇచ్చారని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో 254 కొత్త బ్రాండ్లు వచ్చాయని, భూం భూం, గవర్న్‌ చాయిస్‌, పవర్‌స్టార్‌ 999, ప్రెసిడెంట్ మెడల్, హెవెన్స్ డోర్, క్లిప్ హ్యాంగర్, 999 లెజెండ్, రష్యన్‌ రోమానోవా ఈ బ్రాండ్‌లన్నీ చంద్రన్న కానుకలే అని జగన్ ఎద్దేవే చేశారు.

చంద్రబాబు హయంలో ఈ బ్రాండ్లు హెల్త్ డ్రింక్స్ , ఇప్పుడేమో హానికరమైన మద్యమా అని జగన్ నిలదీశారు.తాము 16 కొత్త జిల్లాలు, మెడికల్ కాలేజీలకు అనుమతిస్తే.. చంద్రబాబు 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అందుకే ఆయన ఇంటి పేరు నారా బదులు సారా అంటే కరెక్టుగా సూట్ అవుతుందన్నారు.

జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ అబద్ధాలు చెబుతోందని సీఎం జగన్ మండిపడ్డారు. టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని.. వారిని జూలో పెట్టాలని జగన్ ఆరోపించారు.

మనిషి పరంగా చంద్రబాబు, పార్టీ పరంగా టీడీపీ, మీడియా పరంగా ఎల్లో మీడియా అనేవి ఏపీలో అసలు సిసలు చీప్ బ్రాండ్స్, చీప్ ఫెల్లోస్ అని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరు ఏపీలో లేకున్నా వీరి వక్రీకరణలు ఏపీలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని విమర్శించారు. వీళ్లందరూ మహిళా వ్యతిరేకులని మండిపడ్డారు.

Related posts