telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దమ్ముంటే బేజ‌వాడ లో నాపై పోటీ చెయ్..లోకేష్‌కి కొడాలి నాని సవాల్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేసి గెలవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ కాదని.. అలా అని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని నాని అన్నారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టిన వ్యక్తి జగన్అ ని ప్రశంసించారు. సీఎం జగన్ వ్యాఖ్యలను టీడీపీ తప్పుదారి పట్టిస్తోందన్నారు. 16 నెలలు జైలులో వుండి కూడా.. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వున్నాడని కొడాలి నాని కొనియాడారు.

వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తం జగన్ లో ప్రవహిస్తుందని చెప్పారు. చంద్రబాబు రక్తంలో సిగ్గూ, శరమూ లేవన్నారు.

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి .. ఆయన్ను సస్పెండ్ చేసి , ముఖ్యమంత్రి పదవిని, పార్టీని లాక్కొన్నారని ఆయన ఆరోపించారు. జగన్‌కు మీలాగా వెన్నుపోటు రాదని… ఎదుటి నుంచే గుండెలు చీలుస్తాడని నాని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని, ప్రజల్లో ఆదరణ లేని దద్దమ్మలు ఇవాళ విమర్శలు చేస్తున్నారు. జగన్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, లోకేష్ కు లేదన్నారు. నువ్వెంత? నీ బతుకెంత? కుక్క బతుకు నీది లోకేష్.. సన్నాసి వెధవల్లారా? అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజలది. ప్రజాదరణ ఉన్న వైఎస్‌ జగన్ ను విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్థుడు నారా లోకేష్‌’’ అని ప్రస్తావించారు మంత్రి కొడాలి నాని.

మూడు రాజధానులు, వికేంద్రీకరణ తమ సిద్ధాంతమని జగన్ స్పష్టం చేశారని నాని పేర్కొన్నారు. న్యాయస్థానాలపై తనకు ఎనలేని గౌరవం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారని, కానీ, ఈ అంశంపైనా ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఈసారి టీడీపీ కి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. సమగ్ర అభివృద్ది…వికేంద్రీకరణపై ప్రభుత్వ వైఖరిని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా వివరిస్తే.. ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని.

నాలుగు సార్లు పదో తరగతి తప్పి.. తాను ఎమ్మెల్యేను అయ్యానని, అమెరికాలో చదివి మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయాడంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఖచ్చితంగా విశాఖ నుంచే పరిపాలన సాగిస్తారని మంత్రి స్పష్టం చేశారు

Related posts