telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీది 40 ఏళ్ల ప్రస్థానం..

*క‌ల్లీ మ‌ధ్యం పై పోరాటం ఉదృతం చేస్తాం – చంద్ర‌బాబు
*బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పార్టీ అండ‌గా నిలిచింది..

*టీడీపీది 40 ఏళ్ల ప్రస్థానం

తన జీవితంలో ఇలాంటి బాధ్యతలేని ప్రభుత్వాన్ని చూడలేదని తెదేపా అధినేత స్పష్టం చేశారు. టీడీపీ 40 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ టీడీపీ 40 ఏళ్ల ప్రస్ధానం లోగో ఆవిష్కరించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారన్నారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారన్నారు.

రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి. శుభసూచికంగా ఉంటుందని పసుపు రంగును ఎన్నుకున్నారు. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే. టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం అన్నారు చంద్రబాబునాయుడు.

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీనే. జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రామ గ్రామన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. జెండావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలి. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలి. స్వర్గీయ నందమూరి తారకరామారావు హైదరాబాద్‌ లోని ఎమ్మెల్యేల క్వార్టర్సులో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే క్వార్టర్సును సందర్శించి.. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తాం. హైదరాబాద్ ఎన్టీఆర్ భవనులో కార్యక్రమాలు చేపడతాం. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారన్నారు చంద్రబాబు.

జంగారెడ్డిగూడెం మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటుసారా మరణాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా? కనీసం దానిపై చర్చ కూడా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విషయంలో సీఎం జగన్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మా ఎమ్మెల్యేలు వివరించారు. దీనిపై ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని టీడీపీ అధినేత స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు. డయా ఫ్రం వాల్ ఎప్పటిలోగా పూర్తి చేసి నీళ్లు ఇస్తారో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పట్ల వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఎద్దేవా చేశారు. నీతి మాలిన చీకటి వ్యాపారం కోసం ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. టీడీపీ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Related posts