రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం రాజధాని మహిళలు వినూత్నరీతిలో నిరసనకు దిగారు. ఇంటి ముందు నాగలికి ఉరివేసుకున్న రైతు ముగ్గు వేసి నిరసన తెలిపారు. కీడు అని తెలిసినా కూడా తమ ఆవేదన ప్రతిబింబించేలా ముగ్గు వేసామంటి మహిళలు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తమ పరిస్థితి ఇదే అని మహిళా రైతులు తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి అంటూ ముగ్గులు వేశారు.