telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యార్థుల ఆత్మహత్యల పై సినిమా తీసే దమ్ముందా: వర్మకు దివ్యవాణి సవాల్

Cine actress divyavani comments ysrcp

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పై సినిమా తీసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. చంద్రబాబు విలువేంటో ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుస్తోందన్నారు. 20 మంది ఇంటర్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును, వాళ్ల తల్లిదండ్రుల సంతోషాన్ని మళ్లీ తీసుకురాగలరా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఎంతమంది బిడ్డలు ఆహుతైపోయారు? మరి ఆ తప్పులపై నీకు సినిమాలు తీసే దమ్ముంటే అప్పుడు నిన్ను నిజమైన డైరెక్టర్ అంటామని ఆమె వ్యాఖ్యానించారు.

సినీ దర్శకుడు అంటే ఎలా ఉండాలో ఇండస్ట్రీలో ఉన్న సీనియర్లను చూసి నేర్చుకో అని హితవు పలికారు. పక్కరాష్ట్రాల వాళ్లు కూడా ఎంతో గౌరవించే చంద్రబాబు పై విమర్శలు చేయడం కాదన్నారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కుటుంబంలో జరిగిన హత్యారాజకీయాలపై సినిమాలు తీయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గొప్పతనం పై పొరుగు రాష్ట్రాల వాళ్లు యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారని చెప్పారు.

Related posts