telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు..

*వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు
*రెక్కీ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు
*జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు సూచించిన చంద్రబాబు
*తెదేపా పూర్తిగా అండగా ఉంటుందన్న చంద్రబాబు
*కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామన్న చంద్రబాబు

ఏపీ రాజకీయాల్లో శనివారం ఆస‌క్తిక‌ర‌మైన‌ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. టీడీపీ నేత వంగవీటి రాధా ఇంటికి వెళ్ళిన తెదేపా అధ్య‌క్షుడు చంద్రబాబునాయుడు ఆయనతో భేటీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందని వంగవీటి రాధా  వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రెక్కీ ఘ‌ట‌న‌పై వంగవీటి రాధా ఆయన తల్లి వంగవీటి రత్నకుమారిను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాధాకు టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు… కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని ఆయన భరోసా కల్పించారు.

Image

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏడు రోజులు అవుతుంది. నేను డీజీపీ కి లేఖ రాశాను. రాధాపై హత్యాయత్నానికి సంబంధించి ఆధారాలున్నా చర్యల్లేవన్నారు. హత్యకు రెక్కీ చేసిన మాట వాస్తవమా?కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రెక్కీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయా? లేదా? అని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. ఎందుకు కాలయాపన చేస్తున్నారని చంద్ర‌బాబు ప్రశ్నించారు.

రెక్కీ చేసినోళ్లని కనిపెట్టకుండా.. దోషులను కాపాడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వంగ వీటి రాధా రక్షణకు గన్ మెన్లు ఇచ్చి… చేతులు దులుపుకుందాం అనుకున్నారని చంద్రబాబు విమర్శించారు.

మ‌రోవైపు రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు కొంతకాలంగా శ‌త‌విధాల ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని.. తన నియోజకవర్గం పరిధిలో రంగా విగ్రహం ఏర్పాటు చేయించి ఆయన వర్ధంతికి రాధాను ఆహ్వానించారు.

 రాధా ప్లాన్ బూమరాంగ్
రాధాను వైసీపీలోకి రప్పించేందుకు ఇంతకన్నా మంచి సమయం దొరకదని భావించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన రాధా.. కొడాలితో పాటు ఆయన మరో మిత్రుడు వంశీకి అంతుబట్టని విధంగా తన హత్యకు రెక్కీ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే రంగంలోకి దిగిన చంద్ర‌బాబు వెంట‌నే ఫోన్‌లో పరామర్శించారు. ఇదే సమయంలో వంగవీటి రాధాను హత్య చేసే ఉద్దేశంతో రెక్కీ నిర్వహించిన ఘటనపై చంద్రబాబు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. రెక్కీ నిర్వహించిన ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఆయన చెప్పారు. శనివారం నేరుగా ఇంటికి వెళ్లి రాధాను పరామర్శించ‌డంతో ఏపీ ఒక్క‌సారిగా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Related posts