telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

పోలీస్ కుటుంబాలకు ఏపీ డీజీపీ అభినందనలు

apcm jagan give full powers to gowtam as dgp

పోలీస్ కుటుంబాలకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. పోలీస్ఉ ద్యోగంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు పరోక్షంగా చేస్తున్న త్యాగాలను ఎప్పటికీ మరువలేనివన్నారు. కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు పవిత్ర కర్యంగా భావించి అత్యుత్తమ సేవలు అందిస్తున్న మిమ్మల్నిమీ కుటుంబ సభ్యులను చూసి గర్వపడుతున్నాను. అదే స్పూర్తితో మీ కుటుంబంలో ఒక్కడిగా కాపాడవలసిన బాధ్యత మన భుజాలపైన ఉందని మిమ్ములను అడిగాను.

నా మాటను మన్నించి, కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో తెలిసినప్పటికీ మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ అత్యుత్తమ సేవలో భాగస్వాములై ప్రజలందరినీ ఇంట్లో ఉండమని, నడిరోడ్డుపై ఒంటరిగా కాపలా కాస్తున్నారు. ఒకరిని ఒకరు, ఒకరి వస్తువులు ఒకరు తాకలేని పరిస్థితులలో కనీసం త్రాగడానికి మంచినీరు అందుబాటులో లేకున్నా, ఆహరం సరిగా లేకున్నా, వయస్సు, ఆరోగ్యం, క్యాడర్లతో గాని సంబంధం లేకుండా, మీరంతా ఐకమత్యంతో కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

Related posts