telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో ప్రభుత్వం వారే ఏర్పాటు చేయనున్నారు.. : రిపబ్లిక్ టీవీ ‘సీ ఓటర్’ సర్వే

Reality Behind The Political Surveys

జాతీయ న్యూస్ చానల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వే ప్రకారం ..ఏపీలో ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొంది. ఈ మేరకు ‘సీ ఓటర్’ సర్వే వివరాలను టీవీ వెల్లడించింది. దేశంలో పలు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జగరనుండగా ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 11న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. సీ ఓటర్-రిపబ్లిక్ టీవీ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం.. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 14 స్థానాలు, వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తేల్చేసింది.

జనవరి అంచనాల ప్రకారం వైసీపీ 19 స్థానాలు, టీడీపీ 6 స్థానాలు గెలుచుకుంటుందని తేలగా, రెండు నెలల్లోనే పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చినట్టు రిపబ్లిక్ టీవీ పేర్కొంది. ఓట్ల శతాన్ని చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 36.4 శాతం ఓట్లను సొంతం చేసుకోగా, టీడీపీ 38.5 శాతం, ఇతరులు 8.2 శాతం ఓట్ల శాతాన్ని సాధిస్తాయని వివరించింది. ఇక యూపీఏ 10.4 శాతం, ఎన్‌డీఏకు 6.5 శాతంతో సరిపెట్టుకుంటాయని అంచనా వేసింది.

Related posts