telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జూన్ తొలివారంలో ఏపీ కేబినెట్ విస్తరణ!

AP Ministers name plates remove secretariat |

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో నేడు జగన్ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించనున్నారు.

ఈ నెల 30న విజయవాడలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఆ రోజు మంత్రులెవరూ ప్రమాణం చేయరని, జూన్ తొలివారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని వైసీపీ వర్గాల సమాచారం. ఈ ఎన్నికల్లో ముఖ్యనేతలను ఓడించిన వైసీపీ అభ్యర్థులు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆశావహుల్లో చాలామంది శుక్రవారం తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌ను కలిశారు.

Related posts