ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్న నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. వివేకా హత్య కేసు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌కు బెయిల్ మంజూరైంది. 90 రోజుల గడిచినా పోలీసుల విచారణ పూర్తికానందున పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. వివేకా నుదుటిపైన, తల వెనుక, రెండువైపులా నాలుగు చోట్ల గొడ్డలితో దాడి చేసిన గాయాలు కనిపించాయి. మొత్తం 7 చోట్ల గొడ్డలితో తీవ్రంగా గాయపరిచినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. పోలీసుల విచారణ పూర్తికానందున నిందితులకు పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.