ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయడం తగదని అన్నారు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం స్పీకర్ స్థానానికే కళంకం అని విమర్శించారు. శాసనసభ స్పీకర్ గా అందరి గౌరవం పొందాల్సిన బాధ్యత తమ్మినేనిపై ఉందని అన్నారు.
స్పీకర్ గా ఓ గౌరవనీయ స్థానంలో ఉన్నప్పుడు దాని ఔన్నత్యాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడడం సబబు కాదన్నారు. శాసనసభలో ఉంటేనే స్పీకర్.. బయట కాదని తమ్మినేని చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు తెలిపారు.