telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సినిమా హాళ్ల ఓపెన్ పై జూన్ తర్వాతే నిర్ణయం: కేంద్ర మంత్రి

praksh javadekar

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లను తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై స్పందించిన మంత్రి ఈ నెల తర్వాత ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related posts