telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ హీరోల అభిమానుల మధ్య ట్విట్టర్ వార్…?

RRR abrivation revealed

ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది అక్టోబర్ 13 న థియేటర్లలో విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ పాత్ర కొమరం భీం ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక రికార్డు రేటుకి ‘ఆర్ఆర్ఆర్’ సాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఏకంగా 325 కోట్లకు జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ‘ట్రిపుల్ ఆర్’ రైట్స్ స్వంతం చేసుకుంది. దీంతో ఆ క్రెడిట్ తమ హీరోదేనంటూ ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య అగ్లీ సోషల్ మీడియా వార్ నడిచింది. ఎన్టీఆర్ అభిమానులు చరణ్ కు వ్యతిరేకంగా, చరణ్ అభిమానులు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా #FanBaselessRamCharan, #FanBaselessNTR అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేశారు.

Related posts